Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి :డి. శ్రీనివాస్ టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి :డి. శ్రీనివాస్ టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.* —- టిపిటిఎఫ్ డిమాండ్
*PRC ని వెంటనే అమలు చేయాలి
*CPS రద్దు కొరకు వెంటనే కమిటీ వేయాలి.*
టిపిటిఎఫ్ జనగామ మండల సర్వ సభ్య సమావేశం మండల అధ్యక్షులు ఎం. గణేష్ అధ్యక్షులు అధ్యక్షతన నేడు ఉమాపతి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ కీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జె ఎ సి కి ఇచ్చిన హామీలలో కేవలం రెండు డి ఎ లు విడుదల చేయడం తప్ప ఇతర హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. పీఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించుకుని అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పీఆర్సీ రిపోర్ట్ పై అతి గతి లేదని మండి పడ్డారు. సి పి ఎస్ విధానం రద్దుకు కమిటీ వేస్తామన్నారు, కానీ దాని ప్రస్తావనే లేదు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ ఎన్ రాజు, ఎండి. అంకుశావళి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తోందని అన్నారు.
ఈ సమావేశంలో టిపిటిఎఫ్ జనగామ మండల నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జనగామ మండల అధ్యక్షునిగా యం. గణేష్, ప్రధాన కార్యదర్శిగా యం. శివ కుమార్ ఉపాధ్యక్షులు గా యం.రమేష్, వసంత, గోవర్ధన్, సత్తిరెడ్డి, కార్యదర్శులుగా రవికుమార్, శ్రీనివాస్ సంబరాజు, స్వరూప, ఎల్ .విజయ్ కుమార్ జిల్లా కౌన్సిలర్స్ గా జి.శ్రీనివాస్, సత్యవర్ధన్ రెడ్డి, మధు, శారదమ్మ, ఉమాదేవి, శ్రీధర్ లు ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఏ రాజా రెడ్డి, శారదమ్మ, వజ్రయ్య యు.శ్రీహరి, మండల కమిటీ సభ్యులు సత్యవర్ధన్ రెడ్డి,, మధు, సాంబరాజు , వై శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి :డి. శ్రీనివాస్ టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి :డి. శ్రీనివాస్ టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి :డి. శ్రీనివాస్ టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *