*పరిశోధనలో ప్రతిభ…*
*ఎల్బీఆర్సీఈ అధ్యాపకునికి పీహెచ్డీ*
*మైలవరం,నవంబర్:
స్థానిక లకిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్ విభాగంలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఓలేటి వెంకట వంశీకృష్ణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది.
విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో బాసిల్ హెచ్. జాన్స్టన్, డేనియల్ డేవిడ్ మోసెస్ రచనల్లో స్వదేశీ సాంస్కృతిక పునరుద్ధరణ, సాహిత్య స్వయంప్రతిపత్తి అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ పరిశోధన ప్రొఫెసర్ రాజశేఖర్ పట్టేటి పర్యవేక్షణలో సాగింది.
ఈ పరిశోధనలో ఆదివాసీ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, భాషా పునరుజ్జీవనం, సాహిత్య స్వయంప్రతిపత్తి, సాంస్కృతిక అస్తిత్వం, వలసవాద భావజాలానికి వ్యతిరేకంగా సాహిత్యం ద్వారా వ్యక్తమయ్యే ప్రతిఘటన వంటి కీలక అంశాలను విశ్లేషించారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. అప్పారావు, ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి. సత్యనారాయణ, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఓలేటి వెంకట వంశీకృష్ణను అభినందించారు.

