*ఇబ్రహీంపట్నం జడ్పీటీసీగా రెంటపల్లి వెంకటేశ్వరరావు ఘన విజయం..!!*
ఎన్టీఆర్ జిల్లా..
ఇబ్రహీంపట్నం,
ఇబ్రహీంపట్నం మండల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో రెంటపల్లి వెంకటేశ్వరరావు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లా ఎన్నికల అధికారి సుశీల చేతుల మీదుగా ఆయన అధికారికంగా గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని (డిక్లరేషన్ సర్టిఫికేట్) అందుకున్నారు.
భారీ ఆధిక్యంతో విజయం సాధించి, తన సొంత గ్రామానికి మరియు మండలానికి మంచి పేరు తీసుకువచ్చిన రెంటపల్లి వెంకటేశ్వరరావుకు స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మండల అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.
వెంకటేశ్వరరావు గెలుపుతో ఇబ్రహీంపట్నం మండలంలో పండగ వాతావరణం నెలకొంది.
గ్రామస్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికి, మిఠాయిలు పంచుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన ఓటర్లకు, నాయకులకు, గ్రామస్తులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల ప్రగతికి శాయశక్తులా పాటుపడతానని ఆయన హామీ ఇచ్చారు.

