Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో

రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా

దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో విస్తృతంగా పెట్రోలింగ్

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా.. ప్రజలు పోలీసులకు సహకరించాలి: ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు

గాజువాక, నవంబర్ 9 (పున్నమి ప్రతినిధి): రాత్రివేళల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ అధికారుల ఆదేశాల మేరకు గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో ప్రత్యేక బీటింగ్, పెట్రోలింగ్‌తో పాటు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత సరైన కారణం లేకుండా రోడ్లపై సంచరించకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వారి భద్రత కోసం పోలీసుల ప్రత్యేక నిఘా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అత్యవసర సహాయం కోసం: 9490617922, పోలీస్ అత్యవసర నంబర్ 112కు సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ సూచించారు. సమాచారం అందిన వెంటనే తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో

రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో

రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో

రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో

రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా దొంగతనాల నివారణే లక్ష్యం.. గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో

Leave a comment

Your email address will not be published. Required fields are marked *