వార్త ముఖ్యాంశాలు
- దీపావళి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం.
- సీతారాం పాత్రుడు విజయనగరం జిల్లా / ప్రజా ప్రతిభ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం.
- సీతారాం పాత్రుడు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
దీపావళి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం. సీతారాం పాత్రుడు
విజయనగరం జిల్లా / ప్రజా ప్రతిభ:
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం. సీతారాం పాత్రుడు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళి అని పేర్కొన్నారు.
ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని సూచించారు.
ఆ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు నిండాలని ఎం. సీతారాం పాత్రుడు ఆకాంక్షించారు.