Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కందుకూరు వైయస్సార్సీపీ శ్రేణులకు నా సెల్యూట్!!! బుర్రా మధుసూదన్ యాదవ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కందుకూరు వైయస్సార్సీపీ శ్రేణులకు నా సెల్యూట్!!! బుర్రా మధుసూదన్ యాదవ్

వార్త ముఖ్యాంశాలు

  • *ఇన్ని అడ్డంకులు ఎదురైన ఈ మహాసంగ్రామాన్ని తట్టుకొని నిలబడి నామినేషన్ దగ్గర నుండి కౌంటింగ్ వరకు ప్రతి అంశంలో నిలబడి గెలిచిన ఓడిన అభ్యర్థులకు ఏజెంట్లకు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు.* *వైఎస్ఆర్సిపి ఏజెంట్లను పోలింగ్ స్టేషన్లో ఉంచకుండా పోలీస్ స్టేషన్లో నిర్భందించి నాకు భయపడి నన్ను హౌస్…
  • స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలుపుతున్నానని అన్నారు.
  • నియోజకవర్గంలో జరిగిన రాజకీయ రాక్షస క్రీడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పోలింగ్ అధికారులు, పోలీసులు కొన్ని అదృశ్యమైన శక్తులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటిలో ఉన్న కాలకోట విషనాగులు, జెర్రిగొడ్డు ఒకటి వీరందరికీ సహకరించిన నాయకులు కొంతమంది భాగం పంచుకొని ఉన్నారని అన్నారు.

*ఇన్ని అడ్డంకులు ఎదురైన ఈ మహాసంగ్రామాన్ని తట్టుకొని నిలబడి నామినేషన్ దగ్గర నుండి కౌంటింగ్ వరకు ప్రతి అంశంలో నిలబడి గెలిచిన ఓడిన అభ్యర్థులకు ఏజెంట్లకు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు.*

*వైఎస్ఆర్సిపి ఏజెంట్లను పోలింగ్ స్టేషన్లో ఉంచకుండా పోలీస్ స్టేషన్లో నిర్భందించి నాకు భయపడి నన్ను హౌస్ అరెస్ట్ చేసి బెదిరింపులు తోటి దౌర్జన్యాలతోటి బడేవారి పాలెం ఎంపీటీసీ అభ్యర్థిని కొట్టి, నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ఇదే దౌర్జన్యం జరిగించి ఎన్నికలు జరిపారు ఇది ఒక ఎన్నిక లేనా.*

*అంతిమంగా జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో పోరాడిన వైసీపీ శ్రేణులదే నైతిక విజయం.*

కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇంటూరి ఆడిన రాజకీయ రాక్షసక్రియలను చూస్తున్నాం ఈ దుర్మార్గాలను దౌర్జన్యాలను ఎదుర్కొని యుద్ధ సైనికుల్లాగా నిలబడి పోటీ చేసిన అభ్యర్థులు తక్కువ మెజార్టీతో ఓడిపోయిన అభ్యర్థులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగనన్న అభిమానులు పోటీలో నిలబడిన ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న తరపున నేను సెల్యూట్ చేస్తున్నానని ఇది సమిష్టి కృషితోనే సాధ్యమైనదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గం ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు.

స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలుపుతున్నానని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన రాజకీయ రాక్షస క్రీడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పోలింగ్ అధికారులు, పోలీసులు కొన్ని అదృశ్యమైన శక్తులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటిలో ఉన్న కాలకోట విషనాగులు, జెర్రిగొడ్డు ఒకటి వీరందరికీ సహకరించిన నాయకులు కొంతమంది భాగం పంచుకొని ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో ఒకపక్క ఇంటూరి నాగేశ్వరరావు బీహార్ ని తలపించే విధంగా ఎలక్షన్ చేస్తుంటే నేను అన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వము లోకేష్ బాబు కూటమి చేసిన తప్పులను ఎప్పటికప్పుడు చూశాను. వాటన్నిటిని పక్కకు నెట్టి ఎన్నికలు మొదలైనప్పటినుండి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్సిపి శ్రేణులను నామినేషన్ వేయికుండా నామినేషన్ కేంద్రాలలోని గూండాలను బ్లేడ్ బ్యాచ్ లను పెట్టి రాక్షస క్రీడకు తెరలేపారని అన్నారు. నామినేషన్ చించి వేయడం మొదటి రాక్షస క్రీడా అయితే రెండవదిగా వైఎస్సార్ పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా చేశారు. మూడవ క్రీడగా స్క్రూట్ నీలో వైసీపీ గెలిచే దగ్గర తప్పుడు ఆరోపణలు పెట్టి లేపేసారు. విత్డ్రాల్లో అధికారులతో ఆడిస్తూ భయపెట్టి బెదిరించి పవర్ అంత ఉపయోగించి విత్ డ్రా లు చేయించారు నాలుగో రాక్షసి క్రియలుగా ఎన్నికల్లో అధికారులను పోలీసులను బూత్ ఆఫీసర్లను ఉపయోగించి వైసిపి ఏజెంట్లను నాయకులను పోలీసుల ద్వారా బూతుల్లో ఉండనీకుండా గ్రామాల్లో భయభ్రాంతులకు గురిచేసి దొంగ ఓట్లు వేసుకోవాలని పన్నాగం ఫన్నీ ఐదు మండలాల్లో బలమైన వ్యక్తులను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బూతులను రెగ్గింగ్ చేయించావు. ఎమ్మెల్యే సొంత ఊర్లో అయితే వైసీపీ క్యాండిటను చెంప మీద కొట్టి నీ మనసులను ప్రోత్సహించి ఏజెంట్లను బయటికి లాగి వేసి రిగ్గింగ్ చేసుకొని 2000 పైచిలుకు మెజార్టీ వచ్చిందని అంటున్నావు. ఇది ఎంత మాత్రం సమంజసం. వి ఆర్ కోట, చిన్నపని పెద్దపవని, ఉలవపాడు మండలం గుడ్లూరు మండలం పలు ప్రాంతాల్లో పదివేల ఓట్లకు పైచిలుకు రిగ్గింగ్ చేసుకున్నావు, ఇలా రిగ్గింగ్ చేసుకొని గెలిచినది కూడా ఒక విజయమేనా ఈ ఎన్నికల్లో నీవు గెలవనే గెలవలేదు రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశావు, బీహార్ సంస్కృతిని కందుకూరు తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే కే దక్కిందని అని తీవ్రంగా విమర్శించారు.

దుర్మార్గమైన విషయం ఏమిటంటే మాచవరం, పాలూరు దొండపాడు చుండి, కరేడు ,అలాగాయపాలెం, బెదిరించి చేసుకున్నావు. అది ఒక గెలుపేనా అని సూటిగా బుర్రా ప్రశ్నించారు, మరో 10 నామినేషన్ వేయకుండా అడ్డగించావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకింగా చేసి గెలిచామని చెప్పుకోవటం ఇది ఒక గెలుపేనా అని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనుసనల్లో జరిగిన దుర్మార్గాలపై ఎలక్షన్ కమిషనర్ కు జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేశామన్నారు ఇన్ని చేసిన అధికారపక్షానికి అధికారులు వంత పాడారు. డ్వాక్రా రుణాలు విషయంలో అధికార పార్టీ అభ్యర్థులకు ఒకరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఒకరకంగా వ్యవహరించడం జరిగిందని అన్నారు. పొదుపు రుణాలు రుణమే కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని అధికారులకు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా పరిగణలోకి తీసుకోలేదని అన్నారు ఎన్నికలు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించలేక పోలీసులను ముఖ్యంగా గుడ్లూరు ఎస్సై లింగ సంవత్సరం ఎస్ఐ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయం వారి చర్యలను బట్టి వారినైతే పసుపు చొక్కా వేసుకుని రమ్మని డ్యూటీ చేయమని కూడా వారించాను. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కాంట్రాక్టర్ల అయితే ఉలవపాడు గుడ్లూరు మండలాల్లో మూడు కోట్ల డబ్బులు పంచె దందా నిర్వహించారు. మా నాయకులను మా ఏజెంట్లను పోలీసులతో స్టేషన్లో కూర్చోబెట్టి నన్ను హౌస్ అరెస్టు చేసి రాత్రికి రాత్రి ఇదంతా చేశారు ఎమ్మెల్యే స్వయం పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి. ముందు ముందు జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గతంలో చేపినట్టు శాంతియుతంగా పోలీసు బెదిరింపులు లేకుండా ఎన్నికలు నిర్వహించు అంతేగాని దౌర్జన్య సంస్కృతిని ప్రవేశపెట్టి ఎన్నికలు జరిపితే వైసిపి మిమ్ములను చిత్తుచిత్తుగా ఓడించే దానికి సిద్ధంగా ఉందన్నారు. జరగబోయే పంచాయితీ మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని వారిని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. డెమోక్రసీలో మేలు జరగాలంటే న్యాయ వైపు ప్రజలు నిలబడే సర్పంచి మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తున్న అధికార పక్షాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు జగనన్న సంక్షేమ అభివృద్ధి వైపు ప్రజలు చూస్తున్నారని ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి నైతిక విజయం దక్కిందని తెలుగుదేశం పార్టీ పైశాచిక విజయంతో ముందుకు పోతుందని తీవ్రంగా విమర్శించారు. ఈ పాత్రికేయ సమావేశంలో గెలిచిన జడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *