Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన పొన్నూరు కాంచన, పొట్టేళ్ల ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన పొన్నూరు కాంచన, పొట్టేళ్ల ప్రసాద్

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 8 ( పున్నమి ప్రతినిధి) జట్లకొండూరు సెగ్మెంట్ పరిధిలోని జట్లకొండూరు, చెర్లోపల్లి, బండేపల్లి పంచాయతీ గ్రామాల ప్రజలకు ఎంపీటీసీ అభ్యర్థి పొన్నూరు కాంచన, జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
  • ఎన్నికల్లో తమకు అమూల్యమైన ఓట్లు వేసి విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
  • మెజారిటీ ఎంత అన్నది ముఖ్యం కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పే ముఖ్యమని పేర్కొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 8 ( పున్నమి ప్రతినిధి)
జట్లకొండూరు సెగ్మెంట్ పరిధిలోని జట్లకొండూరు, చెర్లోపల్లి, బండేపల్లి పంచాయతీ గ్రామాల ప్రజలకు ఎంపీటీసీ అభ్యర్థి పొన్నూరు కాంచన, జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తమకు అమూల్యమైన ఓట్లు వేసి విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మెజారిటీ ఎంత అన్నది ముఖ్యం కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, వారి ఆదరాభిమానాలే తమకు కొండంత బలమని పేర్కొన్నారు. ప్రజాసేవకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *