వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 7 (పున్నమి ప్రతినిధి) జట్లకొండూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పొన్నూరు కాంచన, మనుబోలు మండల జడ్పీటీసీగా పొట్టేలు ప్రసాద్ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
- ఈ సందర్భంగా కుడితిపల్లి గ్రామంలో జట్ల కొండూరు పంచాయతీ.మాజీ సర్పంచ్ వేదోటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
- ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, ఆనందోత్సాహాల మధ్య విజయాన్ని జరుపుకున్నారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 7 (పున్నమి ప్రతినిధి)
జట్లకొండూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పొన్నూరు కాంచన, మనుబోలు మండల జడ్పీటీసీగా పొట్టేలు ప్రసాద్ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా కుడితిపల్లి గ్రామంలో జట్ల కొండూరు పంచాయతీ.మాజీ సర్పంచ్ వేదోటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, ఆనందోత్సాహాల మధ్య విజయాన్ని జరుపుకున్నారు. పార్టీ అభ్యర్థుల విజయంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్