పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు మండల టీడీపీ పార్టీ బలపరచిన జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి తమ సమీప వైసీపీ అభ్యర్థి అంబటి వెంకట సుబ్బమ్మ పై 19740 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు నందుకున్నారు..తమ గెలుపు ఆనంద క్షణాలు, మీడియా మిత్రులతో పంచుకుంటూ,, టీడీపీ పార్టీ పై, పార్టీ అమలు పరచిన దీర్ఘ కాళిక పధకాలపై నమ్మకం ఉంచిన ఓటరు, ఏకపక్ష నిర్ణయంతో జడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించారని, తెలిపారు.. తమ విజయానికి కారణమైన ఓటరు మహాసేయులకు, పార్టీ నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా మహిళా ఓటర్లకు పేరు, పేరున ధన్యవాదములు తెలిపారు… కనిగిరి యం. యల్. ఏ. తమపై ఉంచిన నమ్మకం వృధా కాలేదని, ఈ విజయం యం. యల్. ఏ గారికి దీపావళి కానుకగా ఇచ్చానని జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి అన్నారు..


