పున్నమి తెలుగు దినపత్రిక:.ఖానాపూర్ మండలం లోని పాకాల సరస్సులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
మృతులు గీసుగొండ మండలం హవేలీ గ్రామానికి చెందినవారిగా సమాచారం. మృతురాలిని ఈరెల్లి మమతగా గుర్తించినట్లు తెలుస్తోంది.
పోలీసులు మృతదేహాలను వెలికితీసి విచారణ చేపట్టారు. ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
