Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేటీఎం పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ లింకులు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేటీఎం పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ లింకులు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

వార్త ముఖ్యాంశాలు

  • దీపావళి కానుక పేరుతో రూ.1,000 ఆశ చూపి..
  • ఖాతాలు ఖాళీ చేసే కుట్ర!
  • దీపావళి పండుగ సందర్భంగా పేటీఎం అందరికీ రూ.1,000 కానుకగా అందిస్తోందంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశాలను నమ్మవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

దీపావళి కానుక పేరుతో రూ.1,000 ఆశ చూపి.. ఖాతాలు ఖాళీ చేసే కుట్ర!

దీపావళి పండుగ సందర్భంగా పేటీఎం అందరికీ రూ.1,000 కానుకగా అందిస్తోందంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశాలను నమ్మవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మొదట నకిలీ అనుకున్నా.. కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయి.. మీరూ ప్రయత్నించండి’ అంటూ ప్రజలను మోసగించేలా సందేశాలు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి సందేశాల్లోని లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందన్నారు. ఆ వివరాలతో బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అపరిచిత లింకులను తెరవకుండా, డబ్బు ఆశ చూపే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *