Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు ఎంపీటీసీ పోరు.. 8 స్థానాలకు 21 మంది అభ్యర్థులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు ఎంపీటీసీ పోరు.. 8 స్థానాలకు 21 మంది అభ్యర్థులు!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు: మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.
  • మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు గాను చెర్లో ఏడవల్లి స్థానాన్ని టీడీపీ అభ్యర్థి కేతా వేణుగోపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.
  • మిగిలిన 8 స్థానాలకు 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఆత్మకూరు: మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు గాను చెర్లో ఏడవల్లి స్థానాన్ని టీడీపీ అభ్యర్థి కేతా వేణుగోపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. మిగిలిన 8 స్థానాలకు 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా, శనివారం ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *