Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ప్రముఖ సైకాలజిస్ట్ రాధాకృష్ణారావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ప్రముఖ సైకాలజిస్ట్ రాధాకృష్ణారావు

వార్త ముఖ్యాంశాలు

  • కున్సి: పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ కున్సిలో నిర్వహించిన ఎక్స్‌పర్ట్ టాక్ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్, బీఈడీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ రాధాకృష్ణారావు విద్యార్థులకు విలువైన మార్గదర్శనం చేశారు.
  • ఈ సందర్భంగా చదువు ప్రాముఖ్యత, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించే విధానాలు, సమయపాలన, లక్ష్యసాధన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
  • ప్రముఖ వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించారు.

కున్సి: పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ కున్సిలో నిర్వహించిన ఎక్స్‌పర్ట్ టాక్ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్, బీఈడీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ రాధాకృష్ణారావు విద్యార్థులకు విలువైన మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా చదువు ప్రాముఖ్యత, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించే విధానాలు, సమయపాలన, లక్ష్యసాధన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రముఖ వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించారు.
చదువుతోనే జీవితాలను మార్చుకోవచ్చని, ప్రపంచంలో సమయం అత్యంత విలువైన సంపద అని, ఒక్కసారి చేజారిన సమయం తిరిగి రాదని పేర్కొన్నారు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సంతోషి, ఉపాధ్యాయులు పి. నరేందర్, ఉష, ఖాసీం అలీ, సౌమ్య, నర్సిములు, సత్యనారాయణ రెడ్డి, స్వాతి, గీత, ఆరీఫ్, రాధిక, స్మిత, నగేష్, కృష్ణవేణి, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *