Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఆత్మహత్య కు పాల్పడిన తెలంగాణ ఉద్యమ కారుడు లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మహత్య కు పాల్పడిన తెలంగాణ ఉద్యమ కారుడు లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు భారతీయ జనతా పార్టీ బచ్చన్నపేట మండల శాఖ అధ్యక్షులు బంగారు మహేష్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
  • ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసులపాలై జైలు జీవితం గడపడం జరిగిందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు తెలంగాణపాలించినప్పటికీ ఉద్యమకారులను విస్మరించిందని వారికి న్యాయం జరగలేదని అదేవిధంగా నేడు కాంగ్రెస్…

ఈరోజు భారతీయ జనతా పార్టీ బచ్చన్నపేట మండల శాఖ అధ్యక్షులు బంగారు మహేష్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసులపాలై జైలు జీవితం గడపడం జరిగిందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు తెలంగాణపాలించినప్పటికీ ఉద్యమకారులను విస్మరించిందని వారికి న్యాయం జరగలేదని అదేవిధంగా నేడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపట పూర్తిగా విఫలమైందని లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం మరియు వెంటనే ఉద్యోగం భద్రత కల్పించాలని ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని స్వాతంత్ర సమరయోధులను ఏ విధంగానైతే గుర్తింపు ఇచ్చారు ఉద్యమకారులను గుర్తించి వారికి పెన్షన్ అందించాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బల్ల శ్రీనివాస్ జిల్లా నాయకులు సద్ది సోమిరెడ్డి మండల నాయకులు రాజ నవీన్ పెద్దోజు జగదీష్ మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ వల్లూజు వెంకటేశ్వర్లు శివకృష్ణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *