వార్త ముఖ్యాంశాలు
- ముగిసిన చెకుముకి సైన్స్ సంబరాలు భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో మూడు రోజులుగా కొనసాగిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు మంగళవారంతో ముగిశాయి.
- ముఖ్య అతిథులుగా జేవీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరపు బాలసుబ్రహ్మణ్యం, విద్యాశాఖ అధికారి ఓవీ ఎస్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
- అనంతరం విజేతలకు బహుమతులు అందజేసారు.
ముగిసిన చెకుముకి సైన్స్ సంబరాలు
భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో మూడు రోజులుగా కొనసాగిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు మంగళవారంతో ముగిశాయి. ముఖ్య అతిథులుగా జేవీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరపు బాలసుబ్రహ్మణ్యం, విద్యాశాఖ అధికారి ఓవీ ఎస్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసారు.
విజేతల వీరే.. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట ప్రభుత్వ స్పేస్ సెంట్రల్ పాఠశాల (ప్రథమ), విజయనగరం జిల్లా అయ్యప్పనగర్‌లోని పీఎంశ్రీ ఆదర్శ పాఠశాల (ద్వితీయ), పోలవరం జిల్లా మారేడుమిల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల (తృతీయ), ప్రైవేటు విద్యా సంస్థల విభాగంలో నంద్యాలలోని గుడ్ షెపర్డ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల (ప్రథమ), తిరుపతి కరకంబాడిలోని అమరరాజా విద్యాలయ (ద్వితీయ), అనంతపురం జిల్లా సమతారంలోని రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (తృతీయ) బహుమతులు సాధించాయి.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్