ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సర్ అపోహలు విడనాడాలని పట్టణంలో టీచర్స్ డాక్టర్స్ మేధావులను వ్యక్తిగతంగా కలవడం జరిగింది. మేధావుల ద్వారా ప్రజల్ని చైతన్య పరచాలని సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం మేధావులకు ఉన్నదని మేధావులు మౌనంగా ఉండకుండా ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని సర్ ప్రక్రియ వల్ల పౌరులకు ఎలాంటి ఓటు నష్టం జరగదని ఎవరైతే రెండు చోట్ల ఓటు కలిగిన వ్యక్తులకు ఒక ఓటు తొలగించడం జరుగుతుందని ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇతర దేశాల నుండి అక్రమంగా భారత్లో ప్రవేశించి అరాచకాలకు పాల్పడే వ్యక్తులను తప్పకుండా సర్ ప్రక్రియ ద్వారా వారి ఓటు తొలగించడం జరుగుతుందని ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ ప్రక్రియ అని దీనిని పూర్తిగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆరవ తేదీ విజయ ఫంక్షన్ హాల్ లో మేధావుల సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని మేధావి వర్గం తప్పకుండా సదస్సుకు హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంతరెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి బిజెపి మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్ బిజెపి డాక్టర్ సెల్ కన్వీనర్ శశిధర్ గుప్తా సందీప్ తదితరులు పాల్గొన్నారు

