Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

మూల బొడ్డవర గ్రామంలో న్యాయ సహాయ కేంద్రం — ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మూల బొడ్డవర గ్రామంలో న్యాయ సహాయ కేంద్రం — ప్రారంభం

మూల బొడ్డవర గ్రామంలో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం”

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, నవంబర్0 2 ( పున్నమి ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ( ఏ పి ఎస్ ఎల్ ఎస్ ఏ) వారి ఆదేశాల మేరకు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ( ఎన్ ఏ ఎల్ ఎస్ ఏ )రూపొందించిన అన్ని పథకాల అమలులో భాగంగా నిర్వహిస్తున్న **మెగా డ్రైవ్** కార్యక్రమంలో భాగంగా, విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని మూల బొడ్డవర గ్రామంలో న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ( డి ఎల్ ఎస్ ఏ ) చైర్‌పర్సన్ శ్రీమతి ఎం. బబిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, న్యాయపరమైన సమస్యలపై అవగాహన కల్పించడం, అర్హులైన వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలు మరియు (ఎన్ ఏ ఎల్ ఎస్ ఏ) పథకాల ప్రయోజనాలను చేరవేయడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు.

ఈ న్యాయ సహాయ కేంద్రం ద్వారా ప్రజలు తమ న్యాయపరమైన సమస్యలకు సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు మరియు ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. కేంద్రం నిర్వహణ కోసం ఒక ప్యానెల్ న్యాయవాదిని మరియు ఒక పారా లీగల్ వాలంటీర్ ( పి ఎల్ వి )ను నియమించారు. వీరు గ్రామ ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి న్యాయ సహాయం అందించడంలో సహకరిస్తారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు న్యాయం మరింత చేరువ కావడంతో పాటు, సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సేవలు అందించాలనే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ డాక్టర్. ఏ.కృష్ణ ప్రసాద్ , ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కుమారి కె . కనక లక్ష్మి, బార్ ప్రెసిడెంట్ ఎస్. కోట సత్యజీ మరియు మండల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మూల బొడ్డవర గ్రామంలో న్యాయ సహాయ కేంద్రం — ప్రారంభం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *