*ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో మహాకూటమి ఎంపీటీసీ అభ్యర్థులు ప్రచారం
*ముప్పిడి నాగేశ్వరరెడ్డి, వంకాయలపాటి అరుణ శేషు కుమారి గారి విజయాన్ని కాంక్షిస్తూ*…
*ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు*
*ఎన్టీఆర్ జిల్లా, రె
*కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్దించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు*
*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన రెడ్డిగూడెం మండల జెడ్పీటీసీ అభ్యర్థి వంకాయలపాటి అరుణ శేష కుమారి గారిని, రంగాపురం ఎంపీటీసీ -2 అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండల ఎంపిపి అభ్యర్థి ముప్పిడి నాగేశ్వర రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రజలను కోరారు. కూటమి అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు అందించి, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.*
*హరతులు పట్టి అశీర్వదించిన మహిళలు*
*గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు హారతులు పట్టి, పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథంపై నుంచి ప్రజలను పలకరిస్తూ, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ఓటర్లకు విజ్ణప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించి, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని వివరించారు.*
*పేదల వైద్యానికి ఆర్థిక భరోసా*
*మైలవరం నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్), లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) ద్వారా అనేక మంది పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తూ, సంక్షేమ కార్యక్రమాలనుకొనసాగించమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.*
*ఈ కార్యక్రమం లో రెడ్డిగూడెం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

