Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

మనిషి నుండే మరమనిషి… నేర్చుకుంది (గల్ఫిక ) రచయిత జాగిరి యాదగిరి, గోదావరిఖని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మనిషి నుండే మరమనిషి… నేర్చుకుంది (గల్ఫిక ) రచయిత జాగిరి యాదగిరి, గోదావరిఖని

వార్త ముఖ్యాంశాలు

  • మనిషి నుండే మరమనిషి,..
  • నేర్చుకుంది.(గల్ఫిక) ---------------------------------------------------------- అది చైనాలోని హువాన్ నగరంలో.
  • ఓ బహులంతస్తుల భవనము "చుంగంచుంగ్" హోటల్ అండ్ రెస్టారెంటు, అని షాడో డిజైనింగ్ లో నేమ్ బోర్డు మిరిమిట్లుగొలిపే డెకరేషన్ లైటింగ్ లో మెరిసిపోతుంది.

మనిషి నుండే మరమనిషి,.. నేర్చుకుంది.(గల్ఫిక)
———————————————————-
అది చైనాలోని హువాన్ నగరంలో. ఓ బహులంతస్తుల భవనము
“చుంగంచుంగ్” హోటల్ అండ్ రెస్టారెంటు, అని షాడో డిజైనింగ్ లో నేమ్ బోర్డు మిరిమిట్లుగొలిపే డెకరేషన్ లైటింగ్ లో మెరిసిపోతుంది.
విజిటర్స్ అంతా లిప్టులో వస్తూ.. పోతున్నారు . ఏడవ అంతస్థులో రెస్టారెంటు. పాలరాతిమీద రూమంతా తివాచి పరిచారు, పైన రౌండు టేబుల్స్ ఒక్కో టేబుల్ పైన నలుగురికి సర్వ్ చేసేట్లు. ఏర్పాటుచేశారు.
అదేంచిత్రమో ఒక్కబేరర్ కూడా కన్పించడంలేదు. హాలులో ఒకరోబో సర్వ్ చేస్తూకనిపించింది…ఈ అధునాతన కాలంలో. సర్వ్ చేసే బేరర్లు గా మనుషులను… వారి జీతబత్యాలకు బయపడి ప్రత్యామ్నయంగా ఈ రోబోలనే ప్రతి రంగంలో వాడున్నారు… నిరంతరం పనులలో సతమతమై అలిసిపోతున్న మనుషులకు…. కృత్రిమమేధ. మరమనుషుల సేవ అవశ్య మనిపించిందేమో. పని ఒత్తిడి భరించని మనుషులకు బదులు గా మరమనుషులే నయమనుకున్నారేమో.. ఆ రెష్టారెంటు యాజమాన్యం….
రోబోల సేవలు వాడుకుంటున్నారు.
“చికెన్ బిర్యాని, మఠన్ బిర్యాని, రొయ్యల రోస్టు, పీతల పేస్టు, కప్పల చారు, పాముల వేపుడు….త్రిమింగలముల. కర్రీ…ఎన్ని వెరైటీలో….ఆందులో ఇంటర్నేషనల్ రెస్టారెంటు… ఎప్పుడు విజిటర్స్ ఏ టేబుల్ చూసినా ఖాలీగా కనిపించడంలేదు…
అందులో రోబోల సేవలు.. . ఐతేనేం…కొన్ని రోజులకు రోబోలు కూడా అలిసిపోతున్నవి…. వీటి పనిలో… పాస్ట్ నెస్ .కాస్త తగ్గిపోతున్నది… క్షణం తీరికలేకుండా…. ఆర్డర్ చేసిన ఐటమ్స్ విజిటర్స్ కి చేరవేతలో భాగంగా. ఒకరోబోలో ఎర్రర్ చూపించి ఆగిపోయింది. రోబో డిస్ ప్లే పైన ఓవర్ లోడ్ అని చూపిస్తున్నది.. కౌంటర్ దగ్గర ఉన్న రోబో కంట్రోల్నుండి. రిసెట్ చేశారు.. స్టార్టు యువర్ వర్క్ అంటూ.., ఈసారి రోబో. స్వతహాగా. ఆలోచించించింది.
నా స్థానంలో ఓ మనిషి ఈ పనిలో ఉంటే,,అలసిపోతే. ఏం చేసేవాడని…
వెంటనే… రోబోలో ఏఐ….
సూసైడై అని. ఆన్సర్ ఇచ్చింది…
అంతే… క్షణాలలో… రెస్టారెంటు. ఔట్ సైడ్ వాల్ గ్లాస్ పగిలింది… రోబో శకలాలు. బహులంతస్థుల భవనం క్రింద దీనంగా కనిపిస్తున్నాయి… భవనం నుండి దూకిన విగతజీవివోలె…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *