Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ఇంటి తలుపులు పగలగొట్టి భారీ చోరీ.. బంగారం, వెండి మాయం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరులో ఇంటి తలుపులు పగలగొట్టి భారీ చోరీ.. బంగారం, వెండి మాయం!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు:* నగరంలోని అంబాపురంలో దొంగలు ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు.
  • ఇంటి ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు.
  • సుమతి తన తండ్రి రమణయ్యతో కలిసి బుధవారం రాత్రి స్థానిక రామాలయంలో కోలాటం చూసేందుకు వెళ్లారు.

నెల్లూరు:* నగరంలోని అంబాపురంలో దొంగలు ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. ఇంటి ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. సుమతి తన తండ్రి రమణయ్యతో కలిసి బుధవారం రాత్రి స్థానిక రామాలయంలో కోలాటం చూసేందుకు వెళ్లారు. వారు తిరిగి ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాను పరిశీలించగా 36 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో బాధితులు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చోరీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *