అనంతసాగరం అక్టోబర్ 29,పున్నమి ప్రతినిధి :
మండల కేంద్రం అనంతసాగరంలో గురువారం ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయం నందు పార్టీ ముఖ్య నాయకులతో, ఎన్నికల బరిలో ఉన్నా అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీగా సడ్డ అమరావతితో పాటు 9 సెగ్మెంట్ల నుండి ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారని వీరిని ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి,వైసిపి నాయకులు సడ్డ రవీంద్ర రెడ్డి, రాపూరు సుందరామి రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి సడ్డ అమరావతి, అంబటి కృష్ణా రెడ్డి, బట్రేడ్డి జనార్దన్ రెడ్డి, మెట్టుకూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
