వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు వరికుంటపాడు HP పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
- తాటిపర్తి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు అదుపుతప్పి హైవే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
- ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
దుత్తలూరు వరికుంటపాడు HP పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాటిపర్తి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు అదుపుతప్పి హైవే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఎన్. ముని, హనుమంతరెడ్డి, రవికాంత్‌రెడ్డి, రామకేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.