పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పోటీలో ఉన్న అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కూటమి జడ్పీటీసీ అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు, కె. బిట్రగుంట ఎంపీటీసీ అభ్యర్థి పాలకీర్తి మేఘన, తాళ్లూరు ఎంపీటీసీ అభ్యర్థి విజయమ్మ, నాగులవరం ఎంపీటీసీ అభ్యర్థి గణేషం రమేష్ రెడ్డి, జక్కేపల్లిగూడూరు ఎంపీటీసీ అభ్యర్థి కోడూరు రమాదేవి, బోగోలు వీ.ఎన్.ఆర్. పేట బిట్–2 ఎంపీటీసీ అభ్యర్థి బొడ్డు అరుణకుమారి, వీ.ఎన్.ఆర్. పేట బిట్–1 జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గంటా నేతాజీ, బోగోలు బిట్–3 ఎంపీటీసీ అభ్యర్థి గోశాల శ్యామ్ సుందర్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.




వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్