వార్త ముఖ్యాంశాలు
- అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి* ప్రధాన కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి* పారిశుధ్యం, తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి* -- జిల్లా కలెక్టర్ ఎస్.
- రాంసుందర్ రెడ్డి విజయనగరం, అక్టోబర్ 28: అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.
- రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి*
ప్రధాన కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి*
పారిశుధ్యం, తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి*
— జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, అక్టోబర్ 28: అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రతి అధికారి, సిబ్బంది తమ తమ ప్రధాన కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు.
*లోతట్టు ప్రాంతాలపై నిరంతర నిఘా*
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటివరకు కురిసిన వర్షంలో కొంత భూమిలోకి ఇంకిపోవడం, కొంత ఆవిరి కావడం జరిగిందని, ఇకపై కురిసే వర్షపు నీరు భూమిలో ఇంకే అవకాశం తగ్గి ప్రవాహంగా మారే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని, నాగావళి, చంపావతి నదుల నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
*పారిశుధ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ*
వర్షాలు తగ్గిన వెంటనే గురువారం నుంచి పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రతి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు.
*తాగునీటి సరఫరాలో కాలుష్యానికి తావివ్వొద్దు*
ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి వనరులు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి నాణ్యతపై పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.