Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు ఎంపీటీసీ బిట్టు 2, 3 లో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు ఎంపీటీసీ బిట్టు 2, 3 లో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలోని ఎంపీటీసీ బిట్‌ 2 కూటమి బలపరిచిన అభ్యర్థి పులి వెంకటస్వామి, బిట్‌ 3 అభ్యర్థి గోసెల శ్యామ్‌ కలిసి బోగోలు బజార్‌లోని రాజా వీధిలో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమను గెలిపిస్తే ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థులు తెలిపారు.

అలాగే, జడ్పీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావుకు కూడా తమ విలువైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో నాగులవరం పీఏసీఎస్‌ అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు, బీజేపీ నెల్లూరు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నూకసాని శ్రీనివాస్ యాదవ్, టీడీపీ మాజీ సర్పంచ్ చేబోలు పద్మలత, సీనియర్ నాయకులు నాగరాజు, పుచ్చకాయల రమేష్, అద్భుత రాజ్, గోచిపాతల సంజయ్, బోగిరి ప్రభాకర్, షేక్ సుభాని తదితర నాయకులు పాల్గొన్నారు.

బోగోలు ఎంపీటీసీ బిట్టు 2, 3 లో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *