వార్త ముఖ్యాంశాలు
- మనం నలుగురితో ఉత్సాహంగా కబుర్లు చెబుతుంటే ఎదుటివారు ఆసక్తిగా వినాలి గానీ, ముక్కు మూసుకుని మెల్లగా జారుకుంటే ఎంత అవమానం?
- అదేనండీ నోటి దుర్వాసన చేసే విచిత్రమైన ‘మాయ’!
- ఇది కేవలం దంతాల సమస్య మాత్రమే కాదు, నలుగురిలో మన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలువునా దెబ్బతీసే సామాజిక ఇబ్బంది.
మనం నలుగురితో ఉత్సాహంగా కబుర్లు చెబుతుంటే ఎదుటివారు ఆసక్తిగా వినాలి గానీ, ముక్కు మూసుకుని మెల్లగా జారుకుంటే ఎంత అవమానం? అదేనండీ నోటి దుర్వాసన చేసే విచిత్రమైన ‘మాయ’! ఇది కేవలం దంతాల సమస్య మాత్రమే కాదు, నలుగురిలో మన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలువునా దెబ్బతీసే సామాజిక ఇబ్బంది.
ఈ దుర్వాసన కథలో అసలైన విలన్లు—పళ్ళ సందుల్లో దాక్కునే అన్నం మెతుకులు,
నాలుకపై పేరుకుపోయే తెల్లటి పాచే! వాటిపై బ్యాక్టీరియా చేరి కుళ్ళిపోవడంతో పాటు, నీరు తక్కువగా తాగడం వల్ల నోరు ఎండిపోవడం, పిప్పి పళ్ళు, చిగుళ్ల వాపు, అసిడిటీ, పొగాకు అలవాట్లు తోడవుతాయి. ఫలితంగా పంటి ఆరోగ్యం దెబ్బతినడమే కాక, ఎవరితోనూ స్వేచ్ఛగా మాట్లాడలేక తీవ్రమైన న్యూనతాభావం, మానసిక ఆందోళన మనల్ని చుట్టుముడతాయి.
దీనికి చెక్ పెట్టడం ఏమంత బ్రహ్మవిద్య కాదు. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. పళ్ళతో పాటు నాలుకనూ టంగ్ క్లీనర్‌తో శుభ్రం చేయడం మర్చిపోకూడదు. తిన్న ప్రతిసారీ నోటిని నీటితో బాగా పుక్కిలించాలి. రోజంతా దండిగా నీళ్లు తాగుతూ నోరు తేమగా ఉండేలా చూసుకోవాలి. పొగాకు, ధూమపానానికి పూర్తిగా స్వస్తి పలకాలి. సమస్య కొనసాగితే మొహమాటపడకుండా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి.
ఆరోగ్యకరమైన శరీరానికి ప్రవేశద్వారం మన నోరే! నోటి పరిశుభ్రత కేవలం మన శారీరక ఆరోగ్యం కోసమే కాదు, సమాజంలో తోటివారి పట్ల మనం చూపే కనీస గౌరవం, సామాజిక బాధ్యత. నోటి దుర్వాసనను పారద్రోలి స్వచ్ఛమైన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మన పలుకు వినసొంపవుతుంది, ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంద
డాక్టర్ ఎం.వి. రమణయ్య
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్