వార్త ముఖ్యాంశాలు
- మధుమేహం ఉన్నవాళ్లు రాత్రి పడుకునే ముందు పాదాలను, పొద్దున్నే తొడుక్కునేముందు చెప్పులను.
- చెక్ చేసుకోవాలి ఎందుకంటే...
- మధుమేహం ఎక్కువ కాలం ఉన్నవారికి శరీర చివరి భాగాలైన పాదాలకు రక్త ప్రసరణ క్రమంగా తగ్గిపోతుంది.
మధుమేహం ఉన్నవాళ్లు రాత్రి పడుకునే ముందు పాదాలను, పొద్దున్నే తొడుక్కునేముందు చెప్పులను. చెక్ చేసుకోవాలి
ఎందుకంటే…
మధుమేహం ఎక్కువ కాలం ఉన్నవారికి శరీర చివరి భాగాలైన పాదాలకు రక్త ప్రసరణ క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల కాళ్లలోని నరాలు దెబ్బతిని, స్పర్శ తగ్గిపోతుంది.
చెప్పుల్లో చీల గుచ్చుకున్నా, ముల్లు గుచ్చుకున్నా లేదా బూట్లలో విషపురుగులు చేరి కుట్టినా కూడా నొప్పి సరిగా తెలియదు. నొప్పి తెలియకపోవడం వల్ల నడుస్తూనే ఉంటారు. ఫలితంగా ఆ చిన్న గాయమే పెద్ద పుండుగా మారి చివరికి వైద్యం కూడా పనిచేయక కాలు తొలగించాల్సిన దారుణ పరిస్థితి రావచ్చు.
ఈ ముప్పు నుంచి పాదాలను కాపాడుకోవడానికి రోజూ ఈ 2 సులువైన పనులు చేయాలి.
1.ఉదయం చెప్పులు లేదా బూట్లు వేసుకునే ముందు వాటిని బాగా దులిపి లోపలి అడుగు భాగాన ఏమైనా మేకులు, ముళ్లు లేదా పురుగులు ఉన్నాయేమోనని తప్పనిసరిగా చేత్తో తడిమి పరిశీలించుకోవాలి.
2. రాత్రి పడుకునే ముందు పాదాల అడుగుభాగాన, వేళ్ల సందుల్లో చిన్న గీతలు, గాయాలు, పగుళ్లు లేదా పుండ్లు ఏమైనా అయ్యాయేమో రోజూ శ్రద్ధగా గమనించుకోవాలి.
చిన్న గాయం కనిపించినా నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ విధంగా రోజూ కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే ఈ పెను ప్రమాదాన్ని చాలావరకు నివారించవచ్చు.
….. డాక్టర్ ఎం. వి.రమణయ్య