Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

అర్నబ్” తుఫాను ముప్పు వేళఅధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్నబ్” తుఫాను ముప్పు వేళఅధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం.

“అర్నబ్” తుఫాను ముప్పు ను సమర్థవంతం గా ఎదుర్కొనేందుకు100% సమర్థతతో, జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు లైన్ డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేoధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించి‌ అర్నబ్ తుఫాను సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి.బిందు మాధవ్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్,సహాయ కలెక్టర్ కుమారి ప్రియా, డి.ఆర్.ఓ డాక్టర్ డి. తిప్పే నాయక్ లతో కలిసి పాల్గొ న్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అర్నబ్ తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు తమకు కేటాయించిన విధులను, బాధ్యతలను బాధ్యతా యుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. గత అను భవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు గా పూర్తి అప్రమత్తతతో ఉండాలన్నారు. లైన్ డిపార్ట్‌మెంట్లన్నీ పరస్పరం చర్చించుకుంటూ జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు గల ప్రతి అధికారి, సిబ్బంది పూర్తి సమన్వయం తో పనిచేయాలన్నారు. సరైన సమర్థవంతమైన ప్రణాళిక ద్వారానే ఆస్తి ప్రాణ నష్టాలను పూర్తిగా అరికట్టవచ్చునన్నారు. అడ్వాన్స్ ప్లానింగ్ మరియు రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా సహాయక చర్యలు సంపూర్ణంగాఅందించాలన్నారు.ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ లో ముందస్తు ప్రణాళిక ప్రత్యక్ష పర్యవేక్షణ అత్యంత కీలకం అన్నారు. సంక్షోభ సమయానికి ముందే జిల్లా యంత్రాంగం సంపూర్ణ సన్నద్ధతతో ఉండా లన్నారు. గడిచిన కాలం నాటి డేటాను వర్గీకరించి భద్రపరచాలన్నారు. విపత్తు నిర్వహణ విధానం కేవలం అకాడమిక్‌గా కాకుండా భవిష్యత్తుకు ఒక ప్రామాణిక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా నిలవాలన్నారు. వ్యవసాయ,ఉద్యాన జలవనరులు, వైద్య ఆరోగ్యశాఖ, పశుసంవర్ధక ఆర్ అండ్ బి మత్స్య, మహిళా శిశు సంక్షేమ, స్కూల్ ఎడ్యుకేషన్ పోలీస్ ఫైర్ శాఖలు చేపట్టా ల్సిన చర్యలను వివరించారు రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ల కోసం ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ తరఫున అన్ని వాహనాలను సంబంధిత యాప్‌లో కార్పొరేట్ చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.

అర్నబ్” తుఫాను ముప్పు వేళఅధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం.

అర్నబ్” తుఫాను ముప్పు వేళఅధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం.

అర్నబ్” తుఫాను ముప్పు వేళఅధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *