Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

భైంసాలో ఘనంగా రావణ దహనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భైంసాలో ఘనంగా రావణ దహనం

వార్త ముఖ్యాంశాలు

  • భైంసా పట్టణంలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం రావణ దహనం చేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

భైంసా పట్టణంలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. రామాయణం ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెడును విడనాడి సన్మార్గంలో నడవాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లు, కిసాన్ సేవా సమితి ప్రతినిధులు, ఉత్సవ సమితి ప్రముఖులు, పట్టణ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *