Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలి
నిర్మల్, అక్టోబర్ 19 (పున్నమి): నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాతను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, నిర్మల్ అర్బన్ తహసీల్దార్ ఎం. రాజు, స్థానిక కౌన్సిలర్ పి. శ్రీనివాస్, నాందేడపు చిన్ను, రామోజీ నరేష్, లక్కాకుల హరీష్, ఆలయ కమిటీ చైర్మన్ తల్లా రాజు, నాయకులు శ్రీ చైతన్య, తోట నరసయ్య, కుడుకల గంగాధర్, ప్రశాంత్, మేడిపల్లి పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *