వార్త ముఖ్యాంశాలు
- *మున్సిపల్ నామినేషన్ల ముగింపు సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు* పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా జిల్లాలోని సంబంధిత నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన…
- నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.
*మున్సిపల్ నామినేషన్ల ముగింపు సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు*
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా జిల్లాలోని సంబంధిత నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

