వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, అక్టోబర్ 18 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.
- ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆత్మకూరు సోమశిల రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న రిసెప్షన్…
- ఆత్మకూరు, సంగం, చేజర్ల, మర్రిపాడు, అనంతసాగరం, ఏఎస్‌పేట, కలువాయి మండలాలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి.. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశం
ఆత్మకూరు, అక్టోబర్ 18 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆత్మకూరు సోమశిల రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల గదులను కలెక్టర్ పరిశీలించారు. ఆత్మకూరు, సంగం, చేజర్ల, మర్రిపాడు, అనంతసాగరం, ఏఎస్‌పేట, కలువాయి మండలాలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడింగ్ పక్కాగా ఏర్పాటు చేయాలని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలకు కొరత లేకుండా చూడాలన్నారు. ఎన్నికల సిబ్బంది రాకపోకలు, పోలింగ్ సామగ్రి తరలింపు, వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వెంట ఆత్మకూరు ఆర్డీవో పావని, సర్వే అధికారి కిషోర్, తహసీల్దార్ పద్మజ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.