Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

చెన్నారావుపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీ చింపివేత..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెన్నారావుపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీ చింపివేత..

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నారావుపేట: (పున్నమి )బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చెన్నారావుపేట గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెన్నారావుపేట నెక్కొండ ప్రధాన రహదారి- పక్కన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి సమయంలో చింపివేయడం కలకలం రేపు తుంది.
  • ఈ ఘటనపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • ఈ ఘటన గురించి ఆదివారం ఉదయం సమాచారం తెలుసుకున్న చెన్నారావుపేట గ్రామ మాజీ సర్పంచ్ కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రఫీ, గ్రామ అధ్యక్షులు కందగట్ల సాంబయ్య, మండల ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్, మండల నాయకులు జున్నుతుల శ్రీధర్ రెడ్డి, కేతిడి…

చెన్నారావుపేట: (పున్నమి )బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చెన్నారావుపేట గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెన్నారావుపేట నెక్కొండ ప్రధాన రహదారి- పక్కన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి సమయంలో చింపివేయడం కలకలం రేపు తుంది. ఈ ఘటనపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన గురించి ఆదివారం ఉదయం సమాచారం తెలుసుకున్న చెన్నారావుపేట గ్రామ మాజీ సర్పంచ్ కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రఫీ, గ్రామ అధ్యక్షులు కందగట్ల సాంబయ్య, మండల ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్, మండల నాయకులు జున్నుతుల శ్రీధర్ రెడ్డి, కేతిడి జయపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బతుకమ్మ, దసరా వంటి పండుగలు ప్రజలందరూ కులమత, రాజకీయ భేదాలు లేకుండా కలిసిమెలిసి జరుపుకోవాల్సిన పండుగలని పేర్కొన్నారు. ఇలాంటి పండుగల సమయంలో రాజకీయ కక్షలకు తావివ్వడం, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫ్లెక్సీని చింపివేయడం సరికాదన్నారు.
రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే కానీ, పండుగల వేళ విద్వేషాలకు చోటివ్వకూడదని సూచించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.ఫ్లెక్సీని చింపివేసిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *