వార్త ముఖ్యాంశాలు
- రైతుల విజ్ఞప్తికి స్పందన..
- శ్రీహరి రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి ఫలితం నిర్మల్, పున్నమి ప్రతినిధి: లక్ష్మణ్ చందా మండలంలోని వడ్యాల్–రాచాపూర్ గ్రామాల మధ్య ఉన్న చెరువును సరస్వతీ కెనాల్ నీటితో నింపారు.
- పంటల సాగు, పశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసినట్లు మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ తెలిపారు.
రైతుల విజ్ఞప్తికి స్పందన.. శ్రీహరి రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి ఫలితం
నిర్మల్, పున్నమి ప్రతినిధి: లక్ష్మణ్ చందా
మండలంలోని వడ్యాల్–రాచాపూర్ గ్రామాల మధ్య ఉన్న చెరువును సరస్వతీ కెనాల్ నీటితో నింపారు. పంటల సాగు, పశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసినట్లు మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితోనే నీటి విడుదల సాధ్యమైందని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలోనూ వీడీసీ సభ్యులు, సర్పంచులు సమన్వయంతో ముందుకు వచ్చి చెరువులను నీటితో నింపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్యాల్, రాచాపూర్, కనకాపూర్ సర్పంచులు నరేష్, వెంకట్ రాజు, మహేష్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.