వార్త ముఖ్యాంశాలు
- *చదువుతో పాటు క్రీడల్లోనూ మన ప్రభుత్వ పిల్లలే విజేతలు – పొంగూరు షరిణి** ప్రభుత్వ బడుల పిల్లలు క్రీడల్లో అడుగుపెడితే అద్భుతాలు సృష్టిస్తారు* అకడమిక్స్‌తో పాటు స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇస్తేనే విద్యార్థులు పరిపూర్ణంగా ఎదుగుతారు* ఎంఎస్ఎం స్కూల్ క్రీడాకారులకు నేనే స్వయంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, షూస్ అందిస్తాను…
- వారి కుమార్తె షరిణి పొంగూరు స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వ బడుల రూపురేఖలను సమూలంగా మారుస్తూ విద్యార్థులకు కొండంత భరోసానిస్తున్నారు.
- ఈ అభివృద్ధి బాటలో స్థానిక ఎంఎస్ఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను సందర్శించిన షరిణి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విద్యాశాఖ తరపున అందిస్తున్న స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ స్పోర్ట్స్ అవార్డును 2025-26 సంవత్సరానికి గాను ఎంఎస్ఎం పాఠశాల కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
*చదువుతో పాటు క్రీడల్లోనూ మన ప్రభుత్వ పిల్లలే విజేతలు – పొంగూరు షరిణి** ప్రభుత్వ బడుల పిల్లలు క్రీడల్లో అడుగుపెడితే అద్భుతాలు సృష్టిస్తారు* అకడమిక్స్‌తో పాటు స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇస్తేనే విద్యార్థులు పరిపూర్ణంగా ఎదుగుతారు* ఎంఎస్ఎం స్కూల్ క్రీడాకారులకు నేనే స్వయంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, షూస్ అందిస్తాను – పొంగూరు షరిణి* జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించిన ఎంఎస్ఎం స్కూల్ క్రీడాకారులకు పొంగూరు షరిణి అభినందనలురాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి విశేష కృషితో, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో… వారి కుమార్తె షరిణి పొంగూరు స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వ బడుల రూపురేఖలను సమూలంగా మారుస్తూ విద్యార్థులకు కొండంత భరోసానిస్తున్నారు. ఈ అభివృద్ధి బాటలో స్థానిక ఎంఎస్ఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను సందర్శించిన షరిణి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విద్యాశాఖ తరపున అందిస్తున్న స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ స్పోర్ట్స్ అవార్డును 2025-26 సంవత్సరానికి గాను ఎంఎస్ఎం పాఠశాల కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కనీసం 20 మంది విద్యార్థులు నేషనల్ స్పోర్ట్స్‌కు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, హ్యాండ్ బాల్, సాఫ్ట్‌బాల్, కో-కో, ఆటియా-పాటియా వంటి క్రీడల్లో బాలురు మూడవ స్థానం, బాలికలు రెండవ స్థానం సాధించడమే కాకుండా, లక్నో, జమ్ము అండ్ కశ్మీర్, చండీగఢ్ ప్రాంతాలలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు ఎంపికై పాఠశాల ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం పట్ల క్రీడాకారులను అభినందించారు. కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తేనే విద్యార్థులు పరిపూర్ణంగా ఎదుగుతారని గట్టిగా నమ్ముతూ, విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా, పాఠశాలలో ఈపీటీఎం ఫ్లోరింగ్ మరియు పీపీ టైల్స్‌తో కూడిన అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ గ్రౌండ్ ను కేవలం నెల రోజుల్లోగా రెనోవేట్ చేసి అందిస్తామని ఘంటాపథంగా హామీ ఇవ్వడమే కాకుండా, నేషనల్స్‌కు ఎంపికైన క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, షూస్ మరియు ఇతర అన్ని వసతులను తాను వ్యక్తిగతంగా సమకూరుస్తానని భరోసానిచ్చారు. మంత్రి నారాయణ గారి ఆశయాలకు రూపమిస్తూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అండగా నిలుస్తున్న షరిణి గారి చొరవపై విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. మురళీకృష్ణ మరియు ఫిజికల్ డైరెక్టర్ పి. అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
