వార్త ముఖ్యాంశాలు
- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సంతపేట ప్రాంతంలో పేరున్న వ్యక్తి వందవాసి రంగా ఆ పార్టీకి గుడ్బై చెప్పి శనివారం వైసీపీలో చేరారు.
- నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిటీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో రంగా, ఆయన అనుచరులు టీడీపీకి రాంరాం చెప్పి వైసీపీలో చేరారు.
- ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి వైసీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సంతపేట ప్రాంతంలో పేరున్న వ్యక్తి వందవాసి రంగా ఆ పార్టీకి గుడ్బై చెప్పి శనివారం వైసీపీలో చేరారు.
నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిటీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో రంగా, ఆయన అనుచరులు టీడీపీకి రాంరాం చెప్పి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి వైసీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం టీడీపీ చేస్తున్న దుర్మార్గాలను చూసి సహించలేక, ఆ పార్టీలో ఇమడలేక టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.