Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

NHM ఉద్యోగుల పోరాటానికి ఆప్ సంపూర్ణ మద్దతు.. క్షేత్రస్థాయి నుంచి న్యాయస్థానం వరకు అండగా ఉంటాం: బుర్ర రాముగౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
NHM ఉద్యోగుల పోరాటానికి ఆప్ సంపూర్ణ మద్దతు.. క్షేత్రస్థాయి నుంచి న్యాయస్థానం వరకు అండగా ఉంటాం: బుర్ర రాముగౌడ్

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: రాష్ట్రంలోని 78 కేడర్లకు చెందిన NHM ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాలని కోరుతూ చేస్తున్న పోరాటానికి *ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ మద్దతు ప్రకటించారు.* ఉద్యోగుల న్యాయమైన…
  • NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 100 శాతం గ్రాస్ శాలరీ, GO 1195 పునఃపరిశీలన, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల రద్దు, ప్రతి నెలా 5వ తేదీలోపు జీతాలు, వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా,…
  • ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరీక్షణ్ రాజ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు జుబేర్, సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్, నిజామాబాద్ జిల్లా నాయకులు…

నిర్మల్ జిల్లా అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: రాష్ట్రంలోని 78 కేడర్లకు చెందిన NHM ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాలని కోరుతూ చేస్తున్న పోరాటానికి *ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ మద్దతు ప్రకటించారు.* ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే క్షేత్రస్థాయిలో ఉద్యమించడంతో పాటు న్యాయపోరాటానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 100 శాతం గ్రాస్ శాలరీ, GO 1195 పునఃపరిశీలన, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల రద్దు, ప్రతి నెలా 5వ తేదీలోపు జీతాలు, వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని NHM JAC డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరీక్షణ్ రాజ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు జుబేర్, సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్, నిజామాబాద్ జిల్లా నాయకులు అవేజ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, వనపర్తి జిల్లా నాయకులు యాది చక్రవర్తి, సీనియర్ నాయకులు కొడంగల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
NHM JAC నిర్మల్ అధ్యక్షుడు గంగాధర్, కన్వీనర్ రమణ, జాయింట్ సెక్రటరీ వినీత, డాక్టర్ రమేష్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ మొయిజ్, డాక్టర్ అలీ, డాక్టర్ శ్రీమంత్, డాక్టర్ స్వప్న తదితరులు ఉద్యోగుల సమస్యలను వివరించారు.
NHM ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని, ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయి ఉద్యమంతో పాటు అవసరమైన న్యాయపోరాటానికి కూడా సహకరిస్తామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ స్పష్టం చేశారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *