Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ నిర్వహణ
—————————————————————
జనగామ, అక్టోబర్ 16,పున్నమి జిల్లా ప్రతినిధి :
349 దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక,–
శుక్రవారం, జిల్లాలోని ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్ కేటాయింపునకు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో లాటరీ విధానంలో పారదర్శకంగా నిర్వహించారు.
తెలంగాణ ఎక్సైజ్ (బార్ ద్వారా మద్యం విక్రయించుటకు లైసెన్సుల మంజూరు, లైసెన్సు షరతులు) నియమాలు, 2005 ప్రకారం, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో ఒక నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం (349) దరఖాస్తులు వచ్చాయి.
లాటరీలో DPSG0291 టోకెన్ నంబర్ కలిగిన గడ్డం సందీప్, తండ్రి రమేష్, వీణవంక గ్రామం, మండలం, కరీంనగర్ జిల్లాకు చెందిన దరఖాస్తుదారుడు విజేతగా ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో డీపీఈఓ ఎన్. అంజిరెడ్డి, జనగామ, ఘన్‌పూర్ (స్టేషన్), పాలకుర్తి ఎస్‌హెచ్‌ఓలు జి. శ్రీనివాసరావు, ఎన్. రఘునాథ్ రెడ్డి, ఆర్. బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *