సామాన్య భక్తురాలిగా కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి శిరీష.
కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కాలినడకన అమ్మవారి ఆలయానికి పయనం.
లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు.
విజయవాడ, అక్టోబర్ 15:
మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సతీమణి శ్రీమతి శిరీష గారు గురువారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని ఆమె భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమతి శిరీష గారు కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అమ్మవారి ఆలయం వరకు కాలినడకన వెళ్లారు. ఎలాంటి ప్రత్యేక హంగులు, ఆర్భాటాలకు తావివ్వకుండా సామాన్య భక్తురాలిగా భక్తులతో కలిసి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. భక్తుల మధ్య సాధారణంగా నడుచుకుంటూ అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఆమె, భక్తిభావంతో దుర్గమ్మను దర్శించుకుకున్నారు.
దేవీ నవరాత్రుల వేళ అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తుండగా, శ్రీమతి శిరీష గారు కూడా సామాన్య భక్తురాలిగా కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

