పార్టీని నమ్ముకుని పని చేసిన కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం దక్కేనా
అనాదిగా పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించే దాస్ కుటుంబానికి చైర్మన్ గా పోటీ చేసే అవకాశం దక్కుతుందా
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పులి అరుణకుమారికి పూర్తి మద్దతు తెలుపుతున్న పార్టీ నాయకులు కార్యకర్తలు
కష్టపడిన వారికి అవకాశం దిశగా అభ్యర్థిని ఖరారు చేస్తే పులి కుమారి చైర్మన్ అభ్యర్థి అంటూ ప్రచారం
సొంత సామాజిక వర్గం తో బలమైన అభ్యర్థిగా, ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కలసి వచ్చే అవకాశం ఉందని చర్చలు
స్థానిక కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ సైతం వచ్చిన తరుణంలో నియోజకవర్గ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తూ, స్థానిక ప్రజల్లో బలమైన పట్టున్న సీనియర్ నాయకురాలు, కౌన్సిలర్ పులి అరుణకుమారి ని మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకులు కార్యకర్తల నుండి పులి అరుణకుమారికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రతిపక్షంలోనూ గెలిచిన
పులి అరుణకుమారి కి ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల ప్రజలతో సుదీర్ఘ కాలంగా విడదీయరాని బాంధవ్యం ఉందని స్థానిక నేతలు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉండి, ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్న పులి అరుణ కుమారికి అవకాశం దక్కాలని పార్టీ క్యాడర్ సైతం కోరుకుంటుంది. పార్టీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ, స్థానిక క్యాడర్కు మరియు ప్రజలకు నిరంతరం అండగా నిలబడే గుణం ఆమెను రేసులో ముందంజలో నిలిపింది. ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి పులి అరుణకుమారి సొంత సామాజిక వర్గం యొక్క ఓటింగ్ బలం అత్యంత ప్రధానమైన మరియు బలమైన మూలస్తంభంగా మారనుంది. దీనితో పాటు మున్సిపాలిటీలోని సహచర కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకుల పూర్తి అండదండలు ఆమెకు లభిస్తున్నాయి. స్థానిక సమీకరణాల దృష్ట్యా ఆమె అభ్యర్థిత్వం కూటమికి భారీ విజయాన్ని తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్త ముఖాలు వస్తే సమన్వయం కష్టమే అన్న భావన అందరిలో నెలకొంది. మున్సిపల్ ఎన్నికల వేళ అకస్మాత్తుగా కొత్త వారిని తెరపైకి తెస్తే, వార్డులలోని మిగిలిన నాయకులను, క్యాడర్ను సమన్వయ పరుచుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంటుందని పార్టీ అంతర్గత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందరికీ సుపరిచితురాలైన అరుణకుమారి లాంటి క్రియాశీలక నాయకత్వానికి ప్రాధాన్యత కల్పిస్తే గెలుపు మరింత సులువవుతుందని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ వికాసం కోసం, పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన స్థానిక నాయకత్వానికే మున్సిపల్ చైర్మన్ పీఠం కేటాయించాలని కూటమి శ్రేణులు బలంగా కోరుతున్నారు.
