Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి మున్సిపాలిటీకి సిపిఎం అభ్యర్థి నామినేషన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొండపల్లి మున్సిపాలిటీకి సిపిఎం అభ్యర్థి నామినేషన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు

*కొండపల్లి సిపిఎం మున్సిపల్ అభ్యర్థులకు ‘బి-ఫారం’ అందజేత.*

ఎన్టీఆర్ జిల్లా.
కొండపల్లి, అక్టోబర్ 17:

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7, 13 వార్డుల సిపిఎం (CPM) పార్టీ అభ్యర్థులకు శనివారం పార్టీ అధికారిక ‘బి-ఫారాలు’ అందజేశారు. ఈ మేరకు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎన్.సి.హెచ్. శ్రీనివాస్, సీనియర్ కామ్రేడ్ ఎ. విఠల్ రావు, కొండపల్లి పట్టణ కమిటీ కార్యదర్శి ఎం. మహేష్ తదితరులు అభ్యర్థులకు ఫారాలను హస్తగతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపాలిటీలోని పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలపై సిపిఎం నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడుతోందని గుర్తుచేశారు. ప్రజల హక్కులకై నిలబడే సిపిఎం అభ్యర్థులను రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపల్లి మున్సిపాలిటీకి సిపిఎం అభ్యర్థి నామినేషన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు

కొండపల్లి మున్సిపాలిటీకి సిపిఎం అభ్యర్థి నామినేషన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *