Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ లకు మొండిచేయ రాజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జి కొండూరు మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ లకు మొండిచేయ రాజ్

*స్థానిక సంస్థల రిజర్వేషన్ల లో జి.కొండూరు గ్రామ ఎస్సీ,ఎస్టీ లకు మొండి చెయ్యి…*

జి కొండూరు అక్టోబర్ 16

ఎన్టీఆర్ జిల్లా
జి కొండూరు గ్రామ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఎస్సీ ,ఎస్టీలకు ఎన్నికల కమిషన్ అధికారులు మొండి చెయ్యి చూపించినట్లు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సేల్ అధ్యక్షులు బట్టపర్తి రాజు నిరసన వ్యక్తం చేసారు.
జి కొండూరు గ్రామంలో
ఎస్సీ ఎస్టీల జనాభా అధికంగా ఉంది. స్థానిక గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని జి.కొండూరు_1
mptc నీ బి సి
జనరల్ కు,
జి.కొండూరు _2
వ mptc స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వేషన్ కల్పించారు.
వీటిలో
ఎంపీటీసీ __1 స్థానంలో ఎస్సీ ల ఓట్లు సుమారు 1300 పైగా ఉన్నారు. ఈ ఎంపిటిసి సెగ్మెంట్లో మొత్తం ఓట్లు 3395 ఉన్నాయి. కానీ అత్యధికంగా జనాభా ఓట్లు కలిగిన ఈ స్థానాన్ని ప్రస్తుతం ఎన్నికల అధికారులు బీసీ జనరల్ స్థానానికి కేటాయించడంతో ఎస్సీ సామాజిక వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.2006 లో
జి కొండూరు _1 ఎంపీటీసీ స్థానాన్ని అప్పట్లో రిజర్వేషన్ కల్పించారు. నేటికీ సరిగ్గా 20 ఏళ్లు
కావస్తుంది. ప్రస్తుతం ఈ స్థానాన్ని
1994 __95 సంవత్సరములో mptc,zptc స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
అప్పటి మండల వ్యవస్థ ప్రారంభం అయిన నాటినుండి జరిగిన ఎంపిటిసి ఎన్నికలలో
జి కొండూరు 1వ ఎంపీటీసీ స్థానం కు జరిగిన స్థానిక ఎన్నికల్లో 1994, 2001,2013,
2022 జరిగిన ఎన్నికలలో ఈ స్థానం నుండి బీసీ గౌడ సామాజిక వర్గాలకు చెందిన మాజీ ఎంపీపీ ఉయ్యూరు వెంకట నరసింహారావు, వేములకొండ పద్మావతి, వేములకొండ శైలజాలు ఎస్సీల ఓట్లతో గెలుపొందారు.
2006 లో జరిగిన ఎస్సీ రిజర్వేషన్లు తంగేళ్లుముడీ వీరస్వామి మాత్రమే గెలుపొందారు. ఇటీవల ప్రకటించిన mptc రిజర్వేషన్ జాబితాలో కూడా ఈ స్థానాన్ని బీసీలకు రిజర్వేషన్ కల్పించడం సరైనది కాదని బట్టపర్తి రాజు తన ఆవేదన వ్యక్తం చేశారు.2006 సంవత్సరంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో ఒకసారి మాత్రమే ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు
జి కొండూరు__ 1 సిగ్నెంట్ ను బీసీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ( గౌడ )ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి ఎన్నిక అవుతున్నారు. ఓట్లు మావి సీట్లు మీవా అన్న చందంగా ప్రస్తుత స్థానిక ఎన్నికల పరిస్థితి పరిస్థితి నెలకొన్నద ఉందని బట్టపర్తి రాజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే
జి కొండూరులో_ 2 ఎంపీటీసీ స్థానాన్ని రొటేషన్ పద్ధతిలో ఎస్టీలకు రిజర్వేషన్ ను ఎన్నికల అధికారులు కల్పించకపోవడం పట్ల ఎన్నికల కమిషన్ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ఎస్టీ సామాజిక వర్గాలైన లంబాడి ,ఏ రుకుల ఓట్లు అధికంగా ఉన్నాయి. సుమారు 30 సంవత్సరాలు మండల వ్యవస్థ ప్రారంభమైన నాట్ నుండి నేటి వరకు ఎన్నికల కమిషన్ అధికారులు రిజర్వేషన్ ను ఆ యా వర్గాలకు కల్పించ క పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి జి కొండూరు 1 సిగ్మెంటు ఎంపీటీసీ స్థానాన్ని ఎస్సీలకు ,
జి కొండూరు_2 సెగ్మెంట్ స్థానాన్ని 7ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని బట్టపర్తి రాజు డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనునట్లు ఆయన తెలిపారు.

జి కొండూరు మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ లకు మొండిచేయ రాజ్

జి కొండూరు మండలం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ లకు మొండిచేయ రాజ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *