వార్త ముఖ్యాంశాలు
- టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి కూసుమంచి, అక్టోబర్ 16: కూసుమంచి మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న నాగరాజుకు టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
- ఈ సందర్భంగా నాగరాజును శాలువాతో సత్కరించారు.
- గత రెండేళ్లకు పైగా నాగరాజు శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం అభినందనీయమన్నారు.
టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి
కూసుమంచి, అక్టోబర్ 16: కూసుమంచి మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న నాగరాజుకు టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజును శాలువాతో సత్కరించారు.
గత రెండేళ్లకు పైగా నాగరాజు శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం అభినందనీయమన్నారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సతీష్‌కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. మండలంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి వెంకటేశ్వర్లు, మంద చంద్రశేఖర్ గౌడ్, సీనియర్ పాత్రికేయులు సవాల్వాడి వేణు, ఫోటోగ్రాఫర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.