వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి సబ్డివిజన్ ఇరిగేషన్ శాఖ డీఈఈ మల్లాపు పుల్లయ్యను సస్పెండ్ చేస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
- రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఓ అండ్ ఎం పనుల కోసం రూ.256 కోట్ల నిధులు విడుదల చేసింది.
- అయితే, ఈ పనులకు సంబంధించి బిల్లులు నమోదు చేయకపోవడం, పనుల వివరాలను రికార్డుల్లో పొందుపరచకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఉదయగిరి సబ్డివిజన్ ఇరిగేషన్ శాఖ డీఈఈ మల్లాపు పుల్లయ్యను సస్పెండ్ చేస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఓ అండ్ ఎం పనుల కోసం రూ.256 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే, ఈ పనులకు సంబంధించి బిల్లులు నమోదు చేయకపోవడం, పనుల వివరాలను రికార్డుల్లో పొందుపరచకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా పుల్లయ్యపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఇరిగేషన్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.