Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్ 16(పున్నమి ప్రతినిధి): రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలని ఆత్మకూరు ఎస్‌ఐ జంపానీ కుమార్ సూచించారు.
  • పోలీసు శాఖ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం నబ్బినగరం గ్రామంలో ఆయన సిబ్బందితో కలిసి గ్రామస్తులకు నేరాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎస్‌ఐ..
  • ఎన్నికల సమయంలో ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు.

గ్రామదర్శినిలో ప్రజలకు ఎస్‌ఐ జంపానీ కుమార్ సూచనలు

సైబర్ నేరాలపై అవగాహన.. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపు

ఆత్మకూరు, అక్టోబర్ 16(పున్నమి ప్రతినిధి): రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలని ఆత్మకూరు ఎస్‌ఐ జంపానీ కుమార్ సూచించారు. పోలీసు శాఖ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం నబ్బినగరం గ్రామంలో ఆయన సిబ్బందితో కలిసి గ్రామస్తులకు నేరాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎస్‌ఐ.. ఎన్నికల సమయంలో ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ విభేదాల కారణంగా గ్రామాల్లో గొడవలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఐ జంపానీ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *