వార్త ముఖ్యాంశాలు
- లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో ఆదివాసీ న్యాకపోడ్ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఊరేగింపు సంబరాలను ఘనంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుందరగిరి శ్యామల, వీడీసీ చైర్మన్ సుందరగిరి ముత్తగౌడ్ పాల్గొని బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు.
- ఈ సందర్భంగా సర్పంచ్ శ్యామల, వీడీసీ చైర్మన్ ముత్తగౌడ్లను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.
లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో ఆదివాసీ న్యాకపోడ్ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఊరేగింపు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుందరగిరి శ్యామల, వీడీసీ చైర్మన్ సుందరగిరి ముత్తగౌడ్ పాల్గొని బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్యామల, వీడీసీ చైర్మన్ ముత్తగౌడ్లను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.