వార్త ముఖ్యాంశాలు
- - విడుదలైన షెడ్యూల్ - 28న మున్సిపల్ ఎన్నికలు - 30న ఫలితాలు - జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నవంబర్ 3న - 5న ఫలితాల విడుదల - 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు - నవంబర్ 26న మొదటి దశ - 29న రెండో…
- ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుధవారం విడుదల చేశారు.
- దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
– విడుదలైన షెడ్యూల్
– 28న మున్సిపల్ ఎన్నికలు
– 30న ఫలితాలు
– జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నవంబర్ 3న
– 5న ఫలితాల విడుదల
– 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
– నవంబర్ 26న మొదటి దశ
– 29న రెండో విడత
– డిసెంబర్ 2న మూడో విడత
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుధవారం విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కూడా అందులో ఒక భాగమే. 28న ఎన్నికలు జరగనుండగా, 30న ఫలితాలు విడుదల కానున్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 18 నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21లోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు.
ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికలను నవంబర్ 3న నిర్వహించి, 5వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల విషయానికి వస్తే, 3 దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించే విధంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, ఆయా ఫలితాలను అప్పటికప్పుడే విడుదల చేస్తారు.