Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలో విబిజి రాంజీ పథకం పనుల వద్ద మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలన్నారు.
  • వినియోగదారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయన్నారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలో విబిజి రాంజీ పథకం పనుల వద్ద మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయన్నారు. బ్యాంకు సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఖాతా కలిగి ఉండాలన్నారు. ఖాతాకు కేవైసీ చేసుకోవాలని, నామినీ లను తప్పకుండా పెట్టాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంపాదించే డబ్బులు ఆర్థిక ఖర్చులకు అనుగుణంగా బడ్జెట్ ప్రణాళిక రూపొందించుకొని డబ్బులు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు సులభతరం అవుతాయని తెలిపారు. ఉట్నూరు లోని ఎస్బిఐ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత, వసతి భోజన సౌకర్యంతో శిక్షణ ఇస్తున్నారని, అర్హులు, ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్క్లైమ్డ్ డిపాజిట్ కు సంబంధించి ఎవరైనా డిపాజిటర్లు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నిబంధనల ప్రకారం బ్యాంకు ద్వారా వచ్చే లబ్ధి పొందాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భీమా చేసుకోవడం ద్వారా కుటుంబాలకు భీమా ఉంటుందని అన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్లకు మెసేజ్ లకు స్పందించవద్దని, బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు ఓటీపీ లు ఎవరికి చెప్పవద్దని తెలిపారు. మొబైల్ కి వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు ఒకవేళ మీరు మోసపోయారని ఎలాంటి అనుమానం వచ్చినా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *