వార్త ముఖ్యాంశాలు
- ప్రజా ధనానికి రక్షణగా నిలుస్తూ, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజలకు అండగా మహమ్మద్ అష్రఫ్ కృషి చేస్తున్నారు.
- ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, అవినీతి నిర్మూలనే ఆశయంగా, పారదర్శక పాలనే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
- మరోవైపు సమాచార హక్కు చటాన్ని రక్షించేందుకు సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ, అనేక మంది సామాజిక కార్యకర్తలను, యువతను, ఆర్టీఐ కార్యకర్తలుగా తీర్చి దిద్దుతూ,…
ప్రజా ధనానికి రక్షణగా నిలుస్తూ, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజలకు అండగా మహమ్మద్ అష్రఫ్ కృషి చేస్తున్నారు. ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, అవినీతి నిర్మూలనే ఆశయంగా, పారదర్శక పాలనే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు సమాచార హక్కు చటాన్ని రక్షించేందుకు సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ, అనేక మంది సామాజిక కార్యకర్తలను, యువతను, ఆర్టీఐ కార్యకర్తలుగా తీర్చి దిద్దుతూ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్టీఐ చట్టాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ కృషి చేస్తున్నారు. వీరిద్దరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో వారి హక్కులపై చైతన్యం పెంపొందించేందుకు , ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రయత్నిస్తున్నారు. సమాచార హక్కు చట్టం–2005 ప్రజలకు శక్తివంతమైన సాధనంగా నిలుస్తోంది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ నిధుల వినియోగం, గ్రామపంచాయతీ ఆదాయ వ్యయాలు, రహదారుల నిర్మాణం, అసంపూర్తి అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సమాచారం సేకరించి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు అని తెలిపారు. మహమ్మద్ అష్రఫ్ ఇప్పటికి వేలల్లో ఆర్.టి.ఐ వేసి వాటి న్యాయ పరమైన ఆర్డర్ల కొరకు ఎదురుచూస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అతని పై బెదిరింపులు వచ్చినా, అనధికారిక తప్పుడు కేసులు పెట్టిన, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మహమ్మద్ అష్రఫ్, ప్రభుత్వ రికార్డులను పరిశీలిస్తూ, ప్రజాధనం చట్ట బద్ద వినియోగంపై వివరాలు కోరుతూ, సమస్యలను ఆధారాలతో వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాల్లో పోరాటం కొనసాగిస్తున్నారు.
అదేవిధంగా సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఉపాధ్యక్షులు కొండగుర్ల కమలాకర్ చట్ట పరిరక్షణతో పాటు ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, కార్యకర్తల సమన్వయంతో, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తున్నారు. సమాచార హక్కు దరఖాస్తుల విధానం, సమాచారం పొందే ప్రక్రియ, నిర్ణీత గడువులో సమాచారం అందకపోతే అనుసరించాల్సిన అప్పీల్ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా హక్కుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక పాలన సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకుని సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమలాకర్ సూచిస్తున్నారు. ప్రజలు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజాధనాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొంటున్నారు.
ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాధన సంరక్షణ, పారదర్శక పాలన లక్ష్యంగా మహమ్మద్ అష్రఫ్ చేస్తున్న కృషికి, కొండగుర్ల కమలాకర్ నాయకత్వంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలు తోడై, ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువస్తుంది. సమాచార హక్కు చట్టం 21 అమలు దినోత్సవం సందర్భంగా వీరు మరింత సహా చట్టం అమలు కొరకు, రక్షణ కొరకు కృషి చేయాలని విద్యావంతులు, మేధావులు, సామాజిక, ఆర్టీఐ కార్యకర్తలు కోరుకుంటున్నారు.