జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మంచినేని రాజశేఖర్ గారు అనారోగ్యానికి గురై విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఆస్పత్రికి వెళ్లి రాజశేఖర్ గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

